ఎన్టీఆర్ తో ఎలాంటి గొడవా లేదు: బండ్ల గణేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ తో ఎలాంటి గొడవా లేదు: బండ్ల గణేశ్

Bandla Ganesh gave a clarity on Temper movie issue
  • గతంలో ఎన్టీఆర్ తో 'టెంపర్' తీసిన బండ్ల గణేశ్ 
  • ఎన్టీఆర్ పారితోషికం విషయంలో మనస్పర్థలు అంటూ టాక్ 
  • రీసెంట్ గా ఆ విషయంపై స్పందించిన బండ్ల 
  • మిస్ కమ్యూనికేషన్ కారణమంటూ వివరణ 
చిత్రపరిశ్రమలో చిన్న నటుడిగా బండ్ల గణేశ్ ప్రయాణం మొదలైంది. ఆ తరువాత ఆయన నిర్మాతగా మారి, స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాడు. ఆయన ఖాతాలో భారీ హిట్లతో పాటు పరాజయాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ తో ఆయన 'బాద్ షా' .. 'టెంపర్' సినిమాలను నిర్మించాడు.

'టెంపర్' సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. ఈ సినిమా సమయంలో ఎన్టీఆర్ కి, బండ్ల గణేశ్ కి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు షికారు చేశాయి. ఎన్టీఆర్ పారితోషికం విషయంలో బండ్ల మాట మార్చడం వల్లనే తేడా వచ్చినట్టుగా చెప్పుకున్నారు.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి .. పోతూనే ఉంటాయి. మిస్ కమ్యూనికేషన్ వలన ఏదో జరిగిపోయింది. దానిని గొడవ అనలేం .. ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి గొడవా లేదు" అని ఆయన స్పష్టం చేశాడు.  
Bandla Ganesh
Puri Jagannadh
Junior NTR

More Telugu News