IIT-Kanpur: కరోనా మూడో దశ ముప్పు పొంచే ఉంది.. అక్టోబరు-నవంబరు మధ్య ఉద్ధృతం!

  • ఐఐటీ-కాన్పూర్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
  • డెల్టా వేరియంట్‌కు మించిన కొత్త వేరియంట్ వస్తేనే మూడో దశ
  • ప్రస్తుతానికైతే అలాంటివేవీ లేవని స్పష్టీకరణ
COVID third wave could peak between October November

దేశంలో కరోనా మూడో దశ ముప్పు పొంచే ఉందని, అక్టోబరు-నవంబరు మధ్య ఉద్ధృతంగా ఉండొచ్చని ఐఐటీ-కాన్పూరు  శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా ఏదైనా కొత్త రకం బయటపడితేనే దీని ఉద్ధృతి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలో ఇటీవల సంభవించిన రెండో దశ ఉద్ధృతితో పోలిస్తే మూడో దశ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని కూడా స్పష్టం చేశారు.

ఐఐటీ-కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు  శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం ఉన్న మ్యూటెంట్‌లే మున్ముందూ కొనసాగితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా, ఏదైనా ప్రమాదకర వేరియంట్ పుట్టుకొస్తే మాత్రం థర్డ్ వేవ్ తప్పదని, అప్పుడు రోజుకు గరిష్ఠంగా లక్ష వరకు కేసులు నమోదవుతాయని మనీంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే డెల్టా వేరియంట్‌కు మించిన వేరియంట్‌లు లేవని, ఒకవేళ సెప్టెంబరులో అలాంటి వేరియంట్ ఏదైనా పుట్టుకొస్తే అక్టోబరు-నవంబరు మధ్య మూడో దశ తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

More Telugu News