Virender Sehwag: గేదెపై కూర్చుని పిల్లాడి స్నానం.. వీడియో పోస్ట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్

  • గ్రామాల్లో జీవితం ఇలా స‌ర‌దాగా గ‌డిచిపోతుంటుంద‌న్న సెహ్వాగ్‌
  • న‌గ‌రాల్లో ఉన్న‌వారికి ఇటువంటి స‌ర‌దాల గురించి తెలియ‌ద‌ని వ్యాఖ్య‌
  • వైర‌ల్ అవుతోన్న వీడియో
sehwag shares interesting video

సామాజిక మాధ్య‌మాల్లో  ఆస‌క్తిక‌ర వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటారు టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా ఆయ‌న పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. ఇందులో ఓ గేదెపైకి ఎక్కి ఓ పిల్లాడు స్నానం చేస్తున్నాడు.

ఓ పైపు పట్టుకుని గేదెపైకి ఎక్కిన ఆ పిల్లాడు త‌న‌పై నీళ్లు పోసుకుంటుండ‌గా.. దానికి ఓ బాలీవుడ్ పాట‌ను యాడ్ చేశారు. అలాగే, గేదెపై ప‌డుకుని, కూర్చుని స్నానం చేయ‌డానికి ఆ బాలుడు ప్ర‌య‌త్నిస్తుంటాడు. గ్రామాల్లో జీవితం ఇలా స‌ర‌దాగా గ‌డిచిపోతుంటుంద‌ని, న‌గ‌రాల్లో ఉన్న‌వారికి ఇటువంటి స‌ర‌దాల గురించి తెలియ‌ద‌ని సెహ్వాగ్ పేర్కొన్నారు.  

             https://www.instagram.com/reel/CS9HYkyhQJA/?utm_source=ig_embed&ig_rid=72412d83-591c-4df9-addd-aa9d4acb0e1d

More Telugu News