కిషన్ రెడ్డి భావోద్వేగభరిత వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ విమర్శలు
- కన్నీరు కార్చుతూ ప్రజలను బీజేపీ నేతలు మోసం చేస్తున్నారు
- కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలు చెబుతున్నారు
- తాలిబన్లు ఎంత ప్రమాదకరమో పెగాసస్ కూడా అంతే
జన ఆశీర్వాద యాత్ర అంటూ కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలు చెబుతున్నారని నారాయణ విమర్శించారు. పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసత్యాలు చెబుతుంటే, బయట కేంద్రమంత్రులు కూడా అదే తీరులో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాలిబన్లు ఎంత ప్రమాదకరమో, పెగాసస్ కూడా అంతే ప్రమాదకరమని ఆయన చెప్పారు. పెగాసస్ కు సంబంధించిన విషయాలను చెప్పడానికి మోదీ భయపడుతున్నారని నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల వల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని అఆయన తెలిపారు.