ఒకే చోటికి చేరిన మెగా బ్రదర్స్.. రాఖీ కట్టిన విజయదుర్గ, మాధవి

22-08-2021 Sun 20:26
  • మెగా ఇంట రాఖీ వేడుకలు
  • తోబుట్టువులకు రాఖీ కట్టిన విజయదుర్గ, మాధవి
  • దీవెనలు అందించిన చిరు, నాగబాబు, పవన్
  • రాఖీ వేడుకలు ఆస్వాదించిన మెగా కుటుంబం
Rakhi festival celebrations in Mega Family

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కొణిదెల వారి కుటుంబం అంతా ఒక్కచోటికి చేరింది. హైదరాబాదులోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. చిరంజీవితో పాటు ఆయన సోదరులు నాగేంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా వారి తోబుట్టువులు విజయదుర్గ, మాధవి రాఖీలు కట్టారు. తమ సోదరుల నుంచి దీవెనలు అందుకున్నారు. మిఠాయిలు పంచుకుని రక్షాబంధన్ పండుగ క్షణాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి, చిరంజీవి అర్ధాంగి సురేఖ కూడా పాల్గొన్నారు.