Nara Lokesh: ఏపీ పోలీసుల సంఘాన్ని నాపైకి ఉసిగొల్పుతున్నారు: నారా లోకేశ్

Nara Lokesh slams AP CM Jagan over Ramya murder case
  • రమ్య హత్య ఘటనపై స్పందించిన లోకేశ్
  • ఎప్పుడు ఉరి తీస్తున్నారంటూ ట్వీట్
  • డెడ్ లైన్ ను ప్రస్తావించిన వైనం
  • కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు
ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో బలైన సంగతి తెలిసిందే. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రానికి విడిచిపెట్టారు. ఆ సందర్భంగా నారా లోకేశ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. 21 రోజుల్లోగా రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే తాము తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని లోకేశ్ హెచ్చరించారు.

తాజాగా ఈ అంశంపై లోకేశ్ మరోసారి స్పందించారు. తాను విధించిన డెడ్ లైన్ కు ఇంకా 14 రోజులే మిగిలున్నాయని స్పష్టం చేశారు. విద్యావంతురాలైన రమ్యని హత్యచేసిన వాడికి ఉరి ఎప్పుడు? అని ప్రశ్నించారు.

కాగా, ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తనపైకి ఉసిగొల్పుతున్నారని లోకేశ్ ఆరోపించారు. పోలీసు అధికారుల సంఘాన్ని ఉసిగొల్పడానికి చూపించిన శ్రద్ధ మహిళల రక్షణ కోసం చూపించి ఉంటే మీ పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టి మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని లోకేశ్ హితవు పలికారు.
Nara Lokesh
Jagan
Ramya
Murder
Andhra Pradesh

More Telugu News