తెలంగాణలో కొత్తగా 231 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 46,987 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 66 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 6,384 మందికి చికిత్స
అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,989 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,44,747 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,384 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,858కి పెరిగింది.
