కాబూల్ లో కర్ఫ్యూ విధించిన తాలిబన్లు.. రోడ్లన్నీ నిర్మానుష్యం!
- దేశాన్ని వీడి వెళ్లేందుకు ఆఫ్ఘన్ల ప్రయత్నాలు
- జనాలతో నిండిపోయిన కాబూల్ ఎయిర్ పోర్ట్
- ప్రజలను కట్టడి చేసేందుకు తాలిబన్ల కీలక నిర్ణయం
ముఖ్యంగా కాబూల్ లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. వీలైనంత త్వరగా దేశాన్ని వీడిపోవాలనే ఆత్రుత కాబూల్ ప్రజల్లో ఉంది. ఈ క్రమంలోనే కాబూల్ ఎయిర్ పోర్ట్ నిన్న ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో కాబూల్ లో గందరగోళ పరిస్థితులను నియంత్రించేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్ లో అధికారికంగా కర్ఫ్యూ విధించింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.