'బంగార్రాజు' కోసం సెట్ రెడీ .. బరిలోకి దిగుతున్న నాగ్!

14-08-2021 Sat 10:47
  • 'బంగార్రాజు'కు రంగం సిద్ధం
  • నాగ్ సరసన రమ్యకృష్ణ
  • మరో జోడీగా చైతూ, కృతి శెట్టి  
  • వచ్చేవారంలో షూటింగు మొదలు
Bangarraju shooting starts from next week
నాగార్జున కథానాయకుడిగా 'బంగార్రాజు' సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా షూటింగు మొదలుకానున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ ప్రకారమే ఆ తేదీన షూటింగును మొదలుపెడుతున్నారట. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక భారీ సెట్ వేస్తూ వచ్చారు .. తాజాగా అది పూర్తయింది.

ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వేసిన ఈ సెట్లోనే ఫస్టు షెడ్యూల్ మొదలుకానుంది. నాగార్జున - రమ్యకృష్ణ ప్రధాన పాత్రలను పోషించనున్న ఈ సినిమాకి, కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సొంత బ్యానరులో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'కి ప్రీక్వెల్ అనే అంటున్నారు. టైటిల్ కి తగినట్టుగా కథ గ్రామీణ నేపథ్యంలోనే నడుస్తుందని చెబుతున్నారు. స్వర్గంలో అప్సరసలతో బంగార్రాజు చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మరో జోడీగా చైతూ .. కృతి శెట్టి కనిపించనున్న ఈ సినిమాలో, మోనాల్ గజ్జర్ ఐటమ్ సాంగులో మెరవనుంది.