KTR: టెస్ట్ క్రికెట్ అద్భుతం.. దానిలో ఏదో మాయ ఉంది: కేటీఆర్

Test cricket is wonderful says KTR
  • టెస్ట్ మ్యాచుల్లో ఉండే మజానే వేరు
  • లార్డ్స్ వంటి మైదానాల్లో క్రికెట్ ఆడితే భలే ఉంటుంది
  • ఆండర్సన్ ను కోహ్లీ ఎదుర్కొన్న తీరు అద్భుతం
నిరంతరం ఊపిరిసలపని రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ కు క్రికెట్ అంటే అమితమైన అభిమానం ఉంది. టైమ్ ఉన్నప్పుడల్లా ఆయన క్రికెట్ మ్యాచ్ లను చూస్తుంటారు. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ టెస్ట్ క్రికెట్ గొప్పదనం గురించి చెప్పారు.

టెస్ట్ క్రికెట్ లో ఏదో మాయ ఉందని కేటీఆర్ అన్నారు. టెస్ట్ మ్యాచుల్లో ఉండే మజానే వేరని చెప్పారు. ముఖ్యంగా లార్డ్స్ వంటి గ్రౌండ్స్ లో బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంటుందని... ఇలాంటి చోట్ల క్రికెట్ ఆడితే భలే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లీష్ పేస్ బౌలర్ ఆండర్సన్ స్వింగ్ బౌలింగ్ ను టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఎదుర్కొన్న తీరు అద్భుతమని ప్రశంసించారు. ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ కు వైభవాన్ని తీసుకొచ్చాడని అన్నారు.
KTR
TRS
Test Cricket
Kohli
Rohit Sharma
Team India

More Telugu News