Anil Kumar Yadav: లోకేశ్‌ను చూసి ఎవ‌రూ భ‌య‌ప‌డ‌రు: ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

anil slams lokesh
  • లోకేశ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
  • ఇక‌నైనా వాటిని మానాలి
  • చేతగానితనానికి లోకేశ్‌ కేరాఫ్ అడ్రస్
టీడీపీ నేత నారా లోకేశ్‌పై ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... లోకేశ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నార‌ని, ఇక‌నైనా వాటిని మానాలని వ్యాఖ్యానించారు. చేతగానితనానికి లోకేశ్‌ కేరాఫ్ అడ్రస్ అంటూ చుర‌క‌లంటించారు. తాము లోకేశ్‌లా తండ్రి, తాతను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం లేదని చెప్పారు.

తాను ముఖ్య‌మంత్రి జగన్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. త‌మ‌పై లోకేశ్ చేస్తోన్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయ‌ని అన్నారు. ఆయ‌న‌ను చూసి భయపడేవారు ఎవ‌రూ లేర‌ని చెప్పారు. గ‌త టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువ‌త‌ను మోసం చేసిందని చెప్పుకొచ్చారు. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌ లక్షా 30 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  
Anil Kumar Yadav
YSRCP
Nara Lokesh

More Telugu News