Lalu Prasad Yadav: జంతువులనే లెక్కిస్తున్నప్పుడు.. కులాల వారీగా జనాభాను ఎందుకు లెక్కించకూడదు?: లాలూ ప్రసాద్ యాదవ్

  • కులాల వారీగా జనాభాను లెక్కించాల్సిన అవసరం ఉంది
  • వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం జనాభా లెక్కలు ఎందుకు జరపడం లేదు
  • కులాల వారీగా జనాభా లెక్కింపు తప్పెలా అవుతుంది?
Lalu Yadav demands for caste wise sensus

కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ చేపట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన, మరింత వెనుకబడిన కులాల వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కులాల వారీగా లెక్కలు అవసరమని చెప్పారు. జంతువులు, పక్షులు ఇతర జాతులను మనం లెక్కిస్తున్నామని... అలాంటప్పుడు వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం జనాభా లెక్కలను ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు.

ప్రజల అభ్యున్నతే జనాభా లెక్కింపు ప్రధాన లక్ష్యం అయినప్పుడు... దేశంలోని వేలాది కులాల లెక్కింపు ఎందుకు తప్పవుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నిన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో కూడా కులాల వారీగా జనగణన చేపట్టాలనే అంశంపై చర్చ జరిగింది. కొందరు బీజేపీ ఎంపీలు కూడా ఈ జనగణన కోసం డిమాండ్ చేశారు.

More Telugu News