వివేకా వ్యవహారంలో వాస్తవాలు తెలియాలంటే విజయసాయిని విచారించాలి: బుద్ధా వెంకన్న

13-08-2021 Fri 14:50
  • వివేకా హత్య నేపథ్యంలో బుద్ధా వ్యాఖ్యలు
  • గుండెపోటా? గొడ్డలిపోటా? అంటూ సందేహం
  • విజయసాయిని సీబీఐ విచారణకు పిలవాలని విజ్ఞప్తి
  • ఉత్తరాంధ్రను పట్టిపీడిస్తున్నాడని వ్యాఖ్యలు
Buddha Venkanna says CBI should question Vijayasai Reddy in Viveka case
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన నాటి నుంచే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ నేతలే లక్ష్యంగా టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ అగ్రనేత బుద్ధా వెంకన్న స్పందించారు. వివేకానందరెడ్డి మరణం గుండెపోటా? గొడ్డలిపోటా? అంటూ వ్యాఖ్యానించారు. వివేకా హత్యకేసులో వాస్తవాలు బయటికి రావాలంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని కోరారు.

వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పింది విజయసాయిరెడ్డేనని బుద్ధా తెలిపారు. ఉత్తరాంధ్రను పట్టిపీడిస్తున్న వ్యక్తిని సీబీఐ తక్షణమే విచారణకు పిలవాలని పేర్కొన్నారు. సీబీఐ పులివెందులకు వచ్చినప్పుడల్లా, విజయసాయిరెడ్డి తాను ఎంపీనంటూ ఢిల్లీకి పారిపోతున్నారని ఆరోపించారు.