అజార్ మ్యాచ్ ఫిక్సింగ్ పై సీబీఐ చేత విచారణ చేయించాలి: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి
- అజార్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్లీ తెరవాలి
- బీసీసీఐ ఆదేశాలను అజార్ పాటించడం లేదు
- హెచ్సీఏలో అజార్ చేసిన అక్రమాలను బయటపెట్టాలి
ఈ దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టులకు ఈరోజు గురువారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అజార్ వేసిన పరువునష్టం దావాపై తాము కౌంటర్ వేశామని... అయితే ఇప్పటి వరకు ఆయన నుంచి సమాధానం రాలేదని గురువారెడ్డి అన్నారు. బీసీసీఐ ఆదేశాలను అజార్ పాటించడం లేదని చెప్పారు. హెచ్సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.