లార్డ్స్ టెస్టు: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

Team India lost two wickets in Lords test
షార్ట్స్‌లో చూడండి
లార్డ్స్ టెస్టులో భారత్ మూడో సెషన్ సమయానికి 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులు చేసి జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. 145 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 11 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. సెంచరీ దిశగా వెళుతున్నాడన్న తరుణంలో ఆండర్సన్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన ఛటేశ్వర్ పుజారా కేవలం 9 పరుగులకే అవుటయ్యాడు. ఈ వికెట్ కూడా ఆండర్సన్ ఖాతాలోకే చేరింది.

ప్రస్తుతం భారత్ స్కోరు 53 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ పూర్తిచేసుకుని 55 పరుగులతో ఆడుతున్నాడు. అతడికి జతగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలో దిగాడు.
Go Back to Shorts
Team India
Lords Test
England
Rohit Sharma

More Telugu News