Bajrang Punia: టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ సెమీస్ లో భజరంగ్ పునియా ఓటమి

Bajrang Punia lost in semis
  • భారత్ కు మరోసారి నిరాశ
  • అజర్ బైజాన్ రెజ్లర్ చేతిలో పునియా పరాజయం
  • పునియా డిఫెన్స్ లో లోపాలు
  • వ్యూహాత్మకంగా ఆడిన హాజీ అలియేవ్
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పరాజయం ఎదురైంది. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో భజరంగ్ పునియా ఓటమిపాలయ్యాడు. అజర్ బైజాన్ కు చెందిన మూడుసార్లు వరల్డ్ చాంపియన్ హాజీ అలియేవ్... భజరంగ్ పునియాపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. పునియా డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకున్న అలియేవ్... అదేపనిగా పునియా కాళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాడు. ప్రత్యర్థి ఎత్తుగడలను పసిగట్టడంలో విఫలమైన భారత రెజ్లర్ పునియా తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఇక, కాంస్యం కోసం పోరులో పునియా తలపడనున్నాడు.
Bajrang Punia
Semifinal
Freestyle Wrestling
India
Tokyo Olympics

More Telugu News