Pavan kalyan: పవన్ బర్త్ డే గిఫ్టుగా 'వీరమల్లు' మేకింగ్ వీడియో!

  • మలయాళ రీమేకులో పవన్
  • త్వరలో క్రిష్ ప్రాజెక్టుపైకి
  • లాక్ డౌన్ తరువాత మళ్లీ మొదలు
  • వచ్చే వేసవిలో విడుదల        
Hari Hara Veeramallu movie update

పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. త్వరలో ఆయన 'హరిహర వీరమల్లు' సెట్స్ పైకి వెళతారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

మొగల్ రాజుల కాలం .. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగగా కనిపించనున్నారు. ఆయన లుక్ కి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. వచ్చేనెల 2వ తేదీన పవన్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో వచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. పెద్ద సంఖ్యలో గుర్రాలను వాడుతున్నారు. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా ఈ సినిమాను నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.      

More Telugu News