కొలనోస్కోపీ.. ఇక ఈజీ: డాక్టర్ రామిరెడ్డి రూపొందించిన పరికరానికి పేటెంట్
- గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రామిరెడ్డి
- కాంపోజిట్ పోలిపెక్టమీ స్నేర్ పరికరం రూపకల్పన
- పెద్దపేగు పొరల్లోని పీలికలను గుర్తించడం ఇక సులభం
పెద్దపేగును పరీక్షించేందుకు కొలనోస్కోపీ చేసే సమయంలో లోపలి పొరల్లో ఉన్న పీలికల్ని గుర్తించేందుకు వైద్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు డాక్టర్ రామిరెడ్డి ‘కాంపోజిట్ పోలిపెక్టమీ స్నేర్’ అనే పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరంతో కొలనోస్కోపీ మరింత సులభంగా మారనుంది. సమయం కూడా ఆదా అవుతుంది.
శస్త్ర చికిత్స సమయంలో అయ్యే అంతర్గత రక్తస్రావాలను ఈ పరికరం నియంత్రిస్తుందని డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందన్నారు. కాగా, రామిరెడ్డి గతంలో అన్నవాహిక కేన్సర్‌తో బాధపడుతున్న రోగుల కోసం ‘ఫీడింగ్ పైపు’ను రూపొందించారు. దీనికి కూడా ఆయనకు పేటెంట్ లభించింది.