Manda Krishna Madiga: దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు: మంద కృష్ణ మాదిగ

KCR trying to cheat dalits one more time says Manda Krishna Madiga
షార్ట్స్‌లో చూడండి
దళితబంధు పేరుతో దళితులను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలవుతుందని... అందుకే అధికారాన్ని కోల్పోతామనే భయంతోనే కేసీఆర్ దళితబంధు పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత ఓట్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని అన్నారు.

దళితుల జీవితాలలో సమూల మార్పులను తీసుకొచ్చేందుకు దళితబంధును తీసుకొస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
Go Back to Shorts
Manda Krishna Madiga
MRPS
KCR
TRS
Dalitha Bandhu
Huzurabad

More Telugu News