కచ్చితమైన జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి టీటీడీకి ప్రశంసాపత్రం

Union Govt appreciates TTD for GST returns and tax payments
షార్ట్స్‌లో చూడండి
దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టి నాలుగేళ్లయిన సందర్భంగా జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్న వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ జాబితాలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ఉంది. ఈ క్రమంలో టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. సకాలంలో జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం ఈ మేరకు అభినందించింది. 2021 మార్చి 31 వరకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకు గాను టీటీడీకి ఈ ప్రశంసాపత్రం ఇచ్చారు.

దేశంలోని 11 రాష్ట్రాల్లో లావాదేవీల నిమిత్తం టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. అందులో, రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి ఈ ప్రశంసాపత్రం అందింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి.
Go Back to Shorts
TTD
GST
Union Govt
Appreciation Letter
Andhra Pradesh
India

More Telugu News