టీటీడీలోని ఆరుగురు ఉద్యోగులపై శాశ్వత వేటు
- 2006-08 మధ్య వీరిపై పలు ఆరోపణలు
- ఆర్జిత సేవా టికెట్ల విక్రయంలో అవకతవకలు
- అనుకూల వ్యక్తులకు 30 ఏళ్ల వరకు టికెట్ల విక్రయం
- విచారణ అనంతరం వేటు
తమ అనుకూల వ్యక్తులకు వస్త్రంతోపాటు సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవా టికెట్లను 30 ఏళ్ల వరకు మొత్తం విక్రయించారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటకు రావడంతో 18 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.