చైనాలోనూ డెల్టా వేరియంట్ కేసులు... అప్రమత్తమైన అధికార యంత్రాంగం
- నాన్ జింగ్ నగరంలో డెల్టా వేరియంట్ ఉనికి
- ఎయిర్ పోర్టులో పారిశుద్ధ్య కార్మికులకు కరోనా
- వారి సన్నిహితులకు కరోనా పరీక్షలు
- 200 మందికి పాజిటివ్
- అన్నీ డెల్టా కేసులేనన్న అధికారులు
కరోనా నివారణకు సొంతంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన చైనా, వాటిని ప్రజలకు యుద్ధప్రాతిపదికన అందించింది. అయితే డెల్టా వేరియంట్ కేసులు వెల్లడి అవుతున్న నేపథ్యంలో, ఆ టీకాలు సరైన రక్షణ కనబర్చలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.