వ్య‌వ‌సాయ బావిలో ప‌డిపోయిన కారు.. అందులో ఐదుగురు?

  • కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరులో ఘ‌ట‌న‌
  • గుర్తించిన స్థానికులు
  • కారును బ‌య‌ట‌కు తీసేందుకు పోలీసుల‌ ప్ర‌య‌త్నాలు
కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు మీదుగా ప్ర‌యాణిస్తోన్న‌ ఓ కారు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి అక్క‌డి వ్య‌వ‌సాయ‌ బావిలో పడిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు కారును బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు.

కరీంనగర్ నుండి  కారు హుస్నాబాద్ వెళ్తుండగా చిన్న ముల్కనూరు వద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుందని వివ‌రించారు. ఆ కారులో ఐదుగురు ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు బావిలో ప‌డి అప్పటికే చాలా సమ‌యం కావ‌డంతో వారి పరిస్థితిపై ఆందోళ‌న నెల‌కొంది. ఘటనా స్థ‌లిలో సహాయక చర్యలు కొన‌సాగుతున్నాయి.
Go Back to Shorts
Karimnagar District
car
Road Accident

More Telugu News