ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో విచారణ
- ఇప్పటికే పలువురు సాక్షుల వాంగ్మూలం నమోదు
- రేవంత్, స్టీఫెన్ సన్ కాల్ లిస్టు రిపోర్టు పరిశీలించాలని నిర్ణయం
- తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా
- 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారం
2015లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురిచేశారని, రూ.50 లక్షలు ఇవ్వజూపారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఏసీబీ కేసు పెట్టింది. దీనిపై అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.