మేకప్ లేకుండా ఇలియానా... వైరల్ అవుతున్న ఫొటో

27-07-2021 Tue 20:02
  • సోషల్ మీడియాలో ఇలియానా తాజా పోస్టు
  • ఇది నేనే అంటూ ఫొటో పంచుకున్న వైనం
  • నో మేకప్, నో ఫిల్టర్ అంటూ క్యాప్షన్
  • నెటిజన్లను ఆకర్షిస్తున్న ఫొటో
Actress Ileana shares her pic without makeup

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా, ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. తాజాగా మేకప్ లేకుండా ఇలియానా ఓ ఫొటోను పంచుకుంది. "ఇది నేనే. నో మేకప్, నో ఫిల్టర్" అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది.

 వ్యాయామం చేసిన తర్వాత తీసుకున్న సెల్ఫీ అని వివరించింది. అభిషేక్ బచ్చన్ హీరోగా వచ్చిన ద బిగ్ బుల్ చిత్రంలో నటించిన తర్వాత ఇలియానా నుంచి మరో చిత్రం రాలేదు. రణదీప్ హుడా ప్రధానపాత్రధారిగా వస్తున్న అన్ ఫెయిర్ అండ్ లవ్లీలో ఇలియానా నటించడానికి అంగీకరించింది.