Telangana: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ

Telangana high court hearing on cinema tickets issue
  • రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలపై వివరణ కోరిన హైకోర్టు
  • కమిటీని ఏర్పాటు చేశామన్న ప్రభుత్వ న్యాయవాది
  • కమిటీ నివేదిక సమర్పించిందని వెల్లడి
  • ఆ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు తెలపాలన్న కోర్టు
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత సినిమా టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎలాంటి నిబంధనలను రూపొందించారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సర్కారు తరఫున న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ, టికెట్ ధరలు నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఆ కమిటీ తన సూచనలను ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు.

ఈ క్రమంలో, కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోంమంత్రిత్వ శాఖలకు స్పష్టం చేసింది.
Telangana
High Court
Cinema Tickets
TRS Govt

More Telugu News