పంజాబ్ సమస్య తీరింది.. ఇక, రాజస్థాన్ లో దిద్దుబాటు!.. చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్
- ఈ నెల 28న మంత్రివర్గ విస్తరణ
- పార్టీ నేతలతో కె.సి. వేణుగోపాల్, అజయ్ మాకెన్ సమావేశం
- కేబినెట్ విస్తరణ ఆలస్యంపై పైలట్ ఆగ్రహం
సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ నేత సచిన్ పైలట్ మధ్య వివాదాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడంపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ఈనెల 28న కేబినెట్ ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ అజయ్ మాకెన్ లు.. పీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

జులై 28న ఎమ్మెల్యేలంతా జైపూర్ లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం అశోక్ గెహ్లాట్ తోనూ వారిద్దరు సమావేశమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే శనివారం ఆయనతో వారిద్దరు భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో గెహ్లాట్, పైలట్ వర్గాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.