India: టోక్యో ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో సానియా జోడి ఓట‌మి

ukrain women wins over indian players
షార్ట్స్‌లో చూడండి
టోక్యో ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో సానియా మిర్జా జోడి ఓట‌మి పాలైంది. తొలి రౌండ్‌లోనే ఉక్రెయిన్‌కు చెందిన కవలలు లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్..  సానియా మిర్జా, అంకితా రైనా జోడిని ఓడించారు. భార‌త్‌పై ఉక్రెయిన్ 6-0, 6-7, 8-10 తేడాతో గెలిచింది.

మొద‌ట బాగానే రాణించిన సానియా మిర్జా, అంకితా ఆ త‌ర్వాత ఏ మాత్రం రాణించ‌లేక‌పోయారు. తొలి సెట్‌ను 6-0తో కైవసం చేసుకోగా, అనంత‌రం రెండు సెట్లలో ఓడిపోయారు. మొద‌ట సానియా జోడి రెండో సెట్‌లో 5-3 తేడాతో లీడ్‌లో కొన‌సాగింది. ఆ త‌ర్వాత మాత్రం ఉక్రెయిన్ క్రీడాకారిణుల‌పై సానియా జోడి పైచేయి సాధించ‌లేక‌పోయింది.
Go Back to Shorts
India
tokyo
olympics

More Telugu News