Ashok Gajapathi Raju: మాన్సాస్ ట్రస్టు ఈవో సహకరించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju files petition against MANSAS Trust executive officer
షార్ట్స్‌లో చూడండి
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు మరోసారి రచ్చకెక్కాయి. మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడంలేదని మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఈవో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని పిటిషన్ లో తెలిపారు. అశోక్ గజపతిరాజు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ ను సీజేకి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దాన్ని ఏ బెంచ్ విచారణ జరపాలలేది సీజే నిర్ణయిస్తారని పేర్కొంది. రేపు ఆదివారం కావడంతో ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Go Back to Shorts
Ashok Gajapathi Raju
MANSAS Trust
Executive Officer
Petition
AP High Court

More Telugu News