'జై భీమ్' చిత్రం నుంచి సూర్య ఫస్ట్ లుక్ విడుదల

23-07-2021 Fri 19:34
  • జ్ఞానవేల్ దర్శకత్వంలో 'జై భీమ్'
  • న్యాయవాదిగా సూర్య!
  • నేడు సూర్య పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో సూర్య చిత్రాల అప్ డేట్లు
Suriya first look released from Jai Bhim movie

కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇష్టపడే హీరోల్లో సూర్య ఒకరు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'జై భీమ్'. నేడు సూర్య పుట్టినరోజు నేపథ్యంలో 'జై భీమ్' చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకుడు. ఈ సినిమాలో సూర్య ఓ న్యాయవాది పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కేరళ యువ నటి రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.