Manish Maheswari: ట్విట్టర్ ఎండీకి కర్ణాటక హైకోర్టులో ఊరట... నోటీసుల కొట్టివేత

Karnataka high court dismiss Uttar Pradesh police notices on Twitter India MD Manish Maheswari
  • ఓ వ్యక్తిపై దాడి చేశాడంటూ ఆరోపణలు
  • యూపీ పోలీసుల నోటీసులు
  • కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మనీష్ మహేశ్వరి
  • గతంలో స్టే ఇచ్చిన న్యాయస్థానం
  • ఇవాళ పూర్తిస్థాయి విచారణ
ట్విట్టర్ ఇండియా విభాగం ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట కలిగింది. మనీష్ మహేశ్వరి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలన్న యూపీ పోలీసుల నోటీసులను కర్ణాటక హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. గతంలో ఇదే వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ పూర్తిస్థాయి విచారణ జరిపిన న్యాయస్థానం... యూపీ పోలీసుల నోటీసులు దురుద్దేశపూర్వకంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. పోలీసులు అధికారంతో వేధించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరిని వర్చువల్ గా విచారించుకోవచ్చని ధర్మాసనం సూచించింది. లేదా, మనీష్ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించవచ్చని తెలిపింది.

గతంలో ఓ వ్యక్తిపై దాడి చేశాడంటూ మనీష్ పై యూపీలోని ఘజియాబాద్ పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు రావాలని స్పష్టం చేశారు. దాంతో ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
Manish Maheswari
Twitter India MD
Karnataka High Court
UP Police
Notices

More Telugu News