కొలంబో వన్డేలో మళ్లీ మొదలైన ఆట... ఓవర్ల తగ్గింపు

23-07-2021 Fri 19:04
  • భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో చివరి వన్డే
  • వర్షం వల్ల 23 ఓవర్ల వద్ద నిలిచిన ఆట
  • అప్పటికి భారత్ స్కోరు 147/3
  • శాంతించిన వరుణుడు
  • ప్రస్తుతం భారత్ స్కోరు 29 ఓవర్లలో 185/5
Match begun after rain interruption

కొలంబోలో వరుణుడు శాంతించడంతో టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మళ్లీ మొదలైంది. అయితే ఆట కొద్దిసేపు నిలిచిపోవడంతో ఓవర్లు తగ్గించారు. మ్యాచ్ ను 47 ఓవర్లకు కుదించారు. అంతకుముందు 23 ఓవర్ల వద్ద వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. అప్పటికి భారత్ 3 వికెట్లకు 147 పరుగులు చేసింది.

కాసేపటి తర్వాత ఆట పునఃప్రారంభం కాగా, భారత్ మనీష్ పాండే (11) వికెట్ చేజార్చుకుంది. ఈ వికెట్ జయవిక్రమ ఖాతాలో చేరింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (34 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా (19) జోడీ కుదురుకున్నట్టే కనిపించినా, జయవిక్రమ మరోసారి విజృంభించి పాండ్యాను అవుట్ చేయడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సూర్యకుమార్ కు నితీశ్ రానా జత కలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 29 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు.