Vijayasai Reddy: విశాఖ ఉక్కు ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy met union finance minister Nirmala Sitharaman
  • ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కట్టుబడిన కేంద్రం
  • నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న వైసీపీ 
  • ఆర్థికమంత్రి నిర్మలతో భేటీ
  • ఉక్కు పరిశ్రమ విక్రయం నిలిపివేయాలని విజ్ఞప్తి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఆయన వెంట ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాల నేతలు కూడా ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విక్రయాన్ని నిలిపివేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు.

అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు. నవరత్న హోదా సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఏపీకి ఆభరణం వంటిదని పేర్కొన్నారు.
Vijayasai Reddy
Nirmala Sitharaman
Vizag Steel Plant
Privatization
YSRCP

More Telugu News