టీమిండియా, శ్రీలంక మూడో వన్డేకు వర్షం అంతరాయం

23-07-2021 Fri 17:19
  • కొలంబోలో నేడు మూడో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 23 ఓవర్లలో 3 వికెట్లకు 147 పరుగులు
  • వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేత
Rain halts Team India and Sri Lanka third ODI

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరిదైన మూడో వన్డే వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 23 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన తరుణంలో వర్షం రావడంతో, మ్యాచ్ ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిన సమయానికి టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 22, మనీష్ పాండే 10 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా 49 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేయగా, కెప్టెన్ శిఖర్ ధావన్ 13 పరుగులు చేసి చమీర బౌలింగ్ లో అవుటయ్యాడు. కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న సంజు శాంసన్ 46 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 46 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో దుష్మంత చమీర, ప్రవీణ జయవిక్రమ, కెప్టెన్ దసున్ షనక తలో వికెట్ తీశారు.