Viran: 'బతుకు బస్టాండ్' ట్రైలర్ రిలీజ్

Bathuku Budstand trailer released
  • హీరోగా విరాన్ ఎంట్రీ 
  • కొత్త హీరోయిన్ల పరిచయం
  • షూటింగు పూర్తి 
  • త్వరలోనే విడుదల
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి కొత్త హీరోల తాకిడి పెరుగుతోంది. అల్లు అర్జున్ మేనమామ కొడుకు 'విరాన్' హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా 'బతుకు బస్టాండ్' రూపొందింది. షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, విడుదల దిశగా సన్నాహాలు చేసుకుంటోంది. ఐ.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కవితా రెడ్డి - మాధవి నిర్మించారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా నుంచి, పరశురామ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ప్రేమలో పడిన హీరో తన ప్రియురాలి కోసం బస్టాండ్ లో వెయిట్ చేయడం .. ఆమె కోసం అనేక చోట్ల వెతకడం .. అసహనంతో రగిలిపోవడం .. మద్యానికి బానిస కావడం .. తన దారికి ఎదురైన రౌడీలతో తలపడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలో నిఖిత అరోరా .. శ్రుతిశెట్టి.. జెన్నీఫర్ కథానాయికలుగా అలరించనున్నారు. నాయకా నాయికలతో పాటు, చాలామంది కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. ఒకటి రెండు డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'బతుకు బస్టాండ్' టైటిల్ పై ఫైనల్ డైలాగ్ చెప్పించారు. "ఏంటి బతుకు బస్టాండా .. ఎవరిదీ?  ప్రొడ్యూసర్ దా? డైరెక్టర్ దా?" అని ఒక కేరక్టర్ హీరోతో అంటే, "సినిమా చూసి టైటిల్ కరెక్టో కాదో చెప్పు" అని హీరో అనడం కొసమెరుపు. 

Viran
Nikhitha
Sruthi

More Telugu News