పార్లమెంట్​ లో ప్రవేశపెట్టనున్న బిల్లులివే

19-07-2021 Mon 12:37
 • 31 బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
 • ఆర్డినెన్సుల స్థానంలో ఆరు బిల్లులు
 • జాబితాలో కీలకమైన విద్యుత్, దివాలా, డీఎన్ఏ టెక్నాలజీ బిల్లులు
List Of Bills To Be Introduced By Govt In Parliament Session

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అందులో 29 బిల్లులు కాగా.. మరో రెండు ఆర్థికాంశాలను సభలో పెట్టనుంది. అందులో ఆర్డినెన్సుల స్థానంలో ఆరు బిల్లులను తీసుకురానుంది. కీలకమైన దివాలా, విద్యుత్, డీఎన్ ఏ టెక్నాలజీ బిల్లులను ప్రవేశపెట్టనుంది.  

ఇవీ బిల్లులు..

ఆర్డినెన్స్ స్థానంలో తెస్తున్న బిల్లులు..


 • ట్రైబ్యునల్ సంస్కరణల (హేతుబద్ధీకరణ, సేవల షరతులు) బిల్లు 2021
 • దివాలా నిబంధనల సవరణ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సీ) బిల్లు 2021
 • దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్ బిల్లు 2021
 • రక్షణ ఆవశ్యక సేవల బిల్లు 2021
 • భారత వైద్య కేంద్ర మండలి సవరణ బిల్లు 2021
 • హోమియోపతి కేంద్ర మండలి సవరణ బిల్లు 2021

మిగతా బిల్లులు..

 • విద్యుత్ సవరణ బిల్లు 2021
 • డీఎన్ ఏ సాంకేతికత (వినియోగం విధివిధానాలు) నియంత్రణ బిల్లు 2019
 • కారణాంక (ఫ్యాక్టరింగ్) నియంత్రణ సవరణ బిల్లు 2020
 • సహాయ పునరుత్పాదక సాంకేతికత నియంత్రణ బిల్లు 2020
 • తల్లిదండ్రులు, వృద్ధుల బతుకుదెరువు, సంక్షేమ సవరణ బిల్లు 2019
 • నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ బిల్లు 2019 (ఇప్పటికే రాజ్యసభలో పాసైంది)
 • నౌకాయానానికి సముద్ర సహకార బిల్లు 2021 (లోక్ సభలో పాసైంది)
 • చిన్నారుల న్యాయ (రక్షణ భద్రత) సవరణ బిల్లు 2021 (లోక్ సభలో పాసైంది)
 • సరోగసీ నియంత్రణ బిల్లు 2019
 • బొగ్గు గనుల ప్రాంతాల/భూముల (సేకరణ, అభివృద్ధి) సవరణ బిల్లు 2021
 • చార్టెడ్ అకౌంటెంట్స్, ఖర్చు, అకౌంటెంట్స్ పనులు, కంపెనీ సెక్రటరీల సవరణ బిల్లు 2021
 • పరిమిత పూచీ (లయబిలిటీ) భాగస్వామ్య సవరణ బిల్లు 2021
 • కంటోన్మెంట్ బిల్లు 2021
 • ఇండియన్ అంటార్కిటికా బిల్లు 2021
 • సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు 2021
 • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ బిల్లు 2021
 • పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు 2021
 • బీమా డిపాజిట్, రుణ హామీ కార్పొరేషన్ సవరణ బిల్లు 2021
 • భారత సముద్ర మత్స్యశాఖ బిల్లు 2021
 • పెట్రోలియం, ఖనిజాల పైప్ లైన్స్ సవరణ బిల్లు 2021
 • స్థానిక ఓడల బిల్లు 2021