Revanth Reddy: పార్ల‌మెంటుకు వెళ్ల‌నీయకుండా త‌న‌ను హౌస్ అరెస్టు చేశారంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు

revanth reddy complaits speaker
  • ఈ రోజు తెల్ల‌వారుజామున రేవంత్ హౌస్ అరెస్టు
  • కోకాపేటలో భూముల వద్ద నిరసనకు పిలుపు వేళ చ‌ర్య‌లు
  • లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ లేఖ‌
  • లోక్‌స‌భ‌కు రానివ్వ‌ట్లేరదని ఆరోప‌ణ‌
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ విష‌యంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ ఫిర్యాదు చేశారు. త‌న‌ను పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్ల‌కుండా అడ్డునేందుకే ఇలా చేశార‌ని ఓంబిర్లాకు ఆయన లేఖ రాశారు.

కాగా,  కోకాపేటలో వేలం వేసిన భూముల వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ నేత‌లు సిద్ధం కాగా, ఈ రోజు తెల్లవారుజామునుంచే పోలీసులు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, త‌న‌ను మాత్రం పార్లమెంట్ సమావేశాలకు వెళుతుంటే అడ్డుకున్నారని రేవంత్ అంటున్నారు. రేవంత్‌ను ఢిల్లీకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడానికే హౌస్ అరెస్టు చేసినట్లు ఆయన మ‌ద్ద‌తుదారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy
Congress
TRS

More Telugu News