టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు: కొడాలి నాని

18-07-2021 Sun 19:31
  • చంద్రబాబుపై కొడాలి నాని వ్యాఖ్యలు
  • టీడీపీతో బీజేపీ, జనసేన ఇక కలవవన్న నాని
  • లోకేశ్ తో ప్రయోజనంలేదని బాబుకు తెలుసని వెల్లడి
  • అందుకే బీజేపీలో పార్టీని కలిపేస్తున్నారని స్పష్టీకరణ
Kodali Nani comments on Chandrababu

ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. టీడీపీని కాషాయదళంలో విలీనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని వెల్లడించారు. టీడీపీతో బీజేపీ, జనసేన ఎట్టిపరిస్థితుల్లోనూ కలవవని చంద్రబాబుకు తెలుసని అన్నారు. లోకేశ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థమైపోయిందని పేర్కొన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలిచే అవకాశాలు లేవని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే పార్టీని బీజేపీలో కలిపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై నాని పలు విమర్శలు చేశారు. చంద్రబాబు దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఆయన సొంత కులానికి న్యాయం చేసుకోవడమేనని అన్నారు. కానీ సీఎం జగన్ అన్ని వర్గాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారని వెల్లడించారు.