థాంక్యూ బన్నీ... చరిత్రపై మీకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు: దర్శకుడు గుణశేఖర్

15-07-2021 Thu 17:18
  • శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న గుణశేఖర్
  • ఈ చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్ తనయ
  • బన్నీకు కృతజ్ఞతలు తెలిపిన గుణశేఖర్
  • అర్హను తమ చేతుల్లో పెట్టారంటూ ట్వీట్
Gunasekhar praises Allu Arjun

తాను తెరకెక్కిస్తున్న 'శాకుంతలం' చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటిస్తుండడంపై దర్శకుడు గుణశేఖర్ స్పందించారు. అల్లు అర్హ 'శాకుంతలం' చిత్రంలో యువరాజు భరతుడి పాత్ర పోషిస్తోందని తెలిపారు. అర్హ తమ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. "థాంక్యూ బన్నీ... మీ కుమార్తెను మాకు అప్పగించారు. చరిత్ర, ఘనతర వారసత్వం, సంస్కృతిపై మీకున్న ప్రేమ, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. మీ మద్దతుకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీరు మాపై చూపే అభిమానం వెలకట్టలేనిది" అని పేర్కొన్నారు.