Nara Lokesh: 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇప్పించేలా పోరాటానికి నేను సిద్ధం: నారా లోకేశ్

Iam ready to fight against Jagan for job notifications says Nara Lokesh
  • 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారు
  • రెండేళ్ల తర్వాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేశారు
  • నిరుద్యోగులు ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ఫ్యాన్ తిప్పుతూ... అధికారంలోకి రాగానే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని గొప్పగా చెప్పుకున్నారని... ఈ ఉద్యోగాలన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ అని చెప్పారని అన్నారు. ఇప్పుడు నిరుద్యోగులందరూ అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

రెండేళ్లు గడిచిన తరువాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేసి యువతకి జగన్ తీరని ద్రోహం చేశారని లోకేశ్ మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు స్తోమతకి మించి అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారని చెప్పారు.

ఇప్పుడు వారంతా తిరిగి ఊరు వెళ్లలేక, అమ్మానాన్నలకు మొఖం చూపించలేక ఆందోళనలో ఉన్నారని లోకేశ్ అన్నారు. నిరుద్యోగులు పడుతున్న ఆందోళన చూస్తే బాధేస్తుందని చెప్పారు. ఆత్మ‌హ‌త్య‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కానే కాదని అన్నారు. నిరుద్యోగులు నిరుత్సాహ పడకూడదని... అందరం కలిసి పోరాడుదామని చెప్పారు. జాదూ రెడ్డి మెడలు వంచి 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేలా పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Jobs

More Telugu News