రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం.. నేడు సిఫారసు లేఖల స్వీకరణ రద్దు

15-07-2021 Thu 07:13
  • సహకరించాలని భక్తులను కోరిన టీటీడీ
  • తోమాల సేవను తోమస్ సేవగా మార్చి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
  • భక్తుల మనోభావాలను కించపరిస్తే ఊరుకునేది లేదన్న టీటీడీ
No recommendation letters today says TTD

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం ఉందని, కాబట్టి నేడు వీఐపీ బ్రేక్ దర్శనం సిఫారసు లేఖలను స్వీకరించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. కాగా, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

కొందరు వ్యక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోని తోమాల సేవను తోమస్ సేవగా మార్చి అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది భక్తుల మనోభావాలను కించపరచడమేనని, ఇలాంటి కుట్రలను సహించబోమని హెచ్చరించింది. టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.