TDP: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. పలు అంశాలపై చర్చ

TDP Politburo meeting held today
  • నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం
  • వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
  • జలవివాదం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చించనున్న నేతలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం, వ్యవసాయ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, కుదేలవుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సహజ వనరుల దోపిడీ, జాబ్‌లెస్ క్యాలెండర్, విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ, ఇష్టానుసారం పన్నులు, ధరల పెరుగుదల వంటి అంశాలపై పొలిట్ బ్యూరో చర్చిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
TDP
Andhra Pradesh
politburo
Chandrababu

More Telugu News