Saitej: శాశ్వత భవనం కట్టించిన సాయితేజ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఓల్డేజ్ హోం నిర్వాహకులు

Saitej gets gratitude from an Old Age Home organizers
  • విజయవాడలో సొంతభవనంలేని వృద్ధాశ్రమం
  • సాయం కోరిన నిర్వాహకులు
  • పుట్టినరోజు సందర్భంగా సాయితేజ్ నిర్ణయం
  • అభిమానులకు పిలుపు
  • భారీ మొత్తంతో భవన నిర్మాణం పూర్తి
మెగా హీరో సాయితేజ్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. సొంతభవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయవాడలోని 'అమ్మ ప్రేమ ఆదరణ' అనే ఓల్డేజ్ హోంకు శాశ్వత భవనం కట్టించాడు. రెండేళ్ల కిందట ఈ ఓల్డేజ్ హోం పరిస్థితిని నిర్వాహకులు ట్విట్టర్ ద్వారా సినీ ప్రముఖుల దృష్టికి తీసుకువచ్చారు. సాయితేజ్ తో పాటు మరికొందరు సినీ తారలను ట్యాగ్ చేశారు.

ఈ నేపథ్యంలో, సాయితేజ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ భవనం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకుని అభిమానులకు పిలుపునిచ్చారు. తన జన్మదిన వేడుకలకు అయ్యే ఖర్చును ఓల్డేజ్ హోం భవనం కోసం వినియోగిద్దామని సూచించగా, అభిమానుల నుంచి రూ.1 లక్ష వరకు అందింది. ఆపై, తాను అత్యధిక మొత్తంలో విరాళం అందించి వృద్ధాశ్రమానికి శాశ్వత భవనం నిర్మించారు.

తాజాగా, ఆ ఓల్డేజ్ హోం నిర్వాహకులు సాయితేజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సాయితేజ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ నూతన భవనానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
Saitej
Gratitude
Old Age Home
Vijayawada
Tollywood

More Telugu News