Sajjala Ramakrishna Reddy: పోతిరెడ్డిపాడు లిఫ్ట్ పై చంద్రబాబు వైఖరేంటో స్పష్టం చేయాలి: సజ్జల

Sajjala asks Chandrababu must reveal his stand on Rayalaseema project
  • ఇటీవల సీఎంకు లేఖ రాసిన ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు
  • స్పందించిన సజ్జల
  • చంద్రబాబు కుట్ర అంటూ వ్యాఖ్యలు
  • ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని ఆగ్రహం
రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అందుకే సీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖ రాయించారని, తెలంగాణకు అనుకూలంగా ఎన్జీటీలో కేసులు వేయించారని ఆరోపించారు.

పుట్టిన ప్రాంతం, రాష్ట్రంపై చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని సజ్జల ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద లిఫ్ట్ ఏర్పాటుపై చంద్రబాబు వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల గోడు పట్టదని, ఎంతసేపూ అధికారంపైనే దృష్టి అని విమర్శించారు. చంద్రబాబువి అర్థంలేని ప్రేలాపనలు అని, తానేం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని వ్యాఖ్యానించారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Rayalaseema Project
TDP
CM Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News