కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి... ఎడ్లబండి నుంచి కిందపడిన రాజనర్సింహ
- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
- మెదక్ లో కాంగ్రెస్ నేతల నిరసన
- పాల్గొన్న రాజనర్సింహ
- ఓ ఎడ్లబండిపై ప్రసంగం.. బెదిరిన ఎడ్లు
అయితే, ఈ నిరసన కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు.