సాయం కోసం వేడుకుంటున్న టీవీ నటి
- హిందీ సీరియళ్లతో గుర్తింపు పొందిన అనయా సోనీ
- తెలుగులోనూ నటించిన వైనం
- ఆరేళ్ల కిందట కిడ్నీ ఫెయిల్
- తండ్రి కిడ్నీ దానం చేసినా అదే పరిస్థితి
- కిడ్నీ దాత కోసం ఎదురుచూపులు
పైగా, వారి కుటుంబ వ్యాపారం కూడా ఓ అగ్నిప్రమాదం కారణంగా దెబ్బతింది. అనయా తల్లికి వస్త్రవ్యాపారం ఉండగా, అగ్నిప్రమాదంలో బట్టలు, కుట్టు యంత్రాలు కాలిపోయాయి. దాంతో వారి కుటుంబం దాదాపుగా రోడ్డున పడ్డట్టయింది. ఓ వీడియోలో అనయా మాట్లాడుతూ, ప్రస్తుతం తమ కుటుంబం తిండి కూడా లేని పరిస్థితుల్లో చిక్కుకుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే తాను కోలుకుంటానని చెబుతోంది.
ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామని తాను ఊహించలేదని, కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించింది. తమ పరిస్థితి పట్ల ఉదారంగా స్పందించి సాయం చేయాలని అర్థిస్తోంది. ఈ క్రమంలో అనయా తన బ్యాంకు ఖాతా నెంబరు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.