నేను గట్టిగా కొట్టలేదు... అయినా అతడు మావాడే: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్
- ఇటీవల మాండ్యాలో శివకుమార్ పర్యటన
- చనువుగా ప్రవర్తించిన కార్యకర్త
- తలపై ఒక్కటిచ్చుకున్న శివకుమార్
- విపక్షాల నుంచి విమర్శలు
- వివరణ ఇచ్చిన డీకే
ఎప్పుడైనా అతడు తనను తిడితే భరిస్తానని, తాను అతడ్ని తిట్టినా అతడు కూడా భరిస్తాడని, తమ మధ్య అంతటి సఖ్యత ఉందని వివరించారు. కానీ, పబ్లిక్ లో నడుస్తున్నప్పుడు నడుం చుట్టూ చేయి వేసే ప్రయత్నం చేసే సరికి సహనం కోల్పోయానని డీకే శివకుమార్ తెలిపారు. అప్పటికీ తాను అతడ్ని గట్టిగా కొట్టలేదని, ఓ మోస్తరుగా కొట్టానని వివరణ ఇచ్చారు.