ధనుశ్ జోడీగా కూడా పూజ హెగ్డేనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధనుశ్ జోడీగా కూడా పూజ హెగ్డేనే!

Pooja Hegde in Dhanush movie
  • విడుదలకి రెడీగా ఒక సినిమా
  • ముగింపు దశలో రెండు సినిమాలు
  • స్టార్ హీరోలతో లైన్లో మూడు ప్రాజెక్టులు
  • త్వరలోనే రానున్న స్పష్టత
అదృష్టం, అందాల పూజ హెగ్డే కవల పిల్లలేమోననిపిస్తుంది. ఆమెకి దక్కుతున్న అవకాశాలు .. పెరుగుతున్న క్రేజ్ .. దానికి తగినట్టుగా ముడుతున్న పారితోషికమే అందుకు కారణం. పూజ హెగ్డే తాజా చిత్రంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ తరువాత ఆమె నుంచి 'ఆచార్య' .. 'రాధే శ్యామ్'  ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆమె కెరియర్లో ప్రత్యేకమైనవిగానే చెప్పుకోవాలి. ఇటు చరణ్ జోడీగానూ .. అటు ప్రభాస్ జంటగానూ ఆమె చేయనున్న అందాల సందడి ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాల తరువాత ఆమె చేయనున్న సినిమాలు కూడా ఇంచు మించు ఈ రేంజ్ లోవే. త్రివిక్రమ్ - మహేశ్ ప్రాజెక్టులోను, పవన్ - హరీశ్ శంకర్ సినిమాలోను ఆమె పేరే వినిపిస్తోంది. ఇక నితిన్ జోడీగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఆమెనే కథానాయిక అనే వార్త ఒకటి బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ధనుశ్ సినిమాకి కూడా ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. తెలుగులో వెంకీ అట్లూరి - ధనుశ్ చేసే సినిమా కోసం ఆమెను తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Pooja Hegde
Pavan
Mahesh Babu
Nithin
Dhanush

More Telugu News