కేంద్ర కేబినెట్ విస్తరణ తీరుపై రేవంత్ విమర్శలు
- తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే అవకాశం ఇచ్చారన్న రేవంత్
- తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అవమానంగా భావించాలి
- 10 మందికి యూపీఏ అవకాశం ఇచ్చిందని వ్యాఖ్య
పదేళ్ల యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది తెలుగు వారికి కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో కేవలం ఒక్కరికే ఆ అవకాశం దక్కిందని విమర్శించారు. తమ సామర్థ్యాన్ని బీజేపీ అధినాయకత్వం విశ్వసించనందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు అవమానంగా భావించాలని అన్నారు.