రోదసీలో చైనా మరో ఘనత.. వ్యోమగాముల తొలి స్పేస్ వాక్
- సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్న చైనా
- ‘తియాన్హే’ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేసిన వ్యోమగాములు
- దాదాపు ఏడు గంటలపాటు కేంద్రం బయటే
జూన్ 17న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఈ వ్యోమగాములు మూడు నెలల పాటు అక్కడే ఉంటారు. ఏప్రిల్ 29న చైనా తన అంతరిక్ష కేంద్రానికి చెందిన తొలి మాడ్యూల్‌ను రోదసీలోకి పంపింది. వచ్చే ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని చైనా యోచిస్తోంది. ఇందుకోసం ఏకంగా 11 రాకెట్లను ప్రయోగించనుంది. పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత తియాన్హే అంతరిక్ష కేంద్రం బరువు 70 టన్నులు ఉంటుంది.